Sunday, June 23, 2024
HomeఆటAnantapur: సౌత్ జోన్ అండర్-14 క్రికెట్ పోటీలు

Anantapur: సౌత్ జోన్ అండర్-14 క్రికెట్ పోటీలు

ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో క్రీడాకారులను అలాగే క్రీడలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. పిటిసి మైదానంలో సౌత్ జోన్ అండర్ 14 బాలబాలికల టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ తనకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టమని… గతంలో క్రికెట్ బాగా ఆడే వాడినని గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు పిటిసిలో చాలా సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించే దిశగా ఎంపీ సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడలకు అలాగే మైదానాల అభివృద్ధికి ఎలాంటి అవసరమైన తనను సంప్రదించాలని.. ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News