Andhra Premier League 2025: మైత్రి మూవీ మేకర్స్ క్రికెట్ జట్టు ఇదే..! APL 2025 సీజన్ ఆగష్ట్ 8 నుండి ప్రారంభం అవుతుంది. జూలై 14 2025న విశాఖపట్నంలో క్రీడాకారుల వేలం నిర్వహణ జరిగింది. ఈ సీజన్ లో మొత్తం 7 జట్లు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని సౌత్, నార్త్, సెంట్రల్ జోన్ల నుండి ప్రాంఛైజీలు పాల్గొన్నారు. దీంతో కొత్త ఆటగాళ్లు, స్పాన్సర్ల ఆకర్షణ పెరిగింది. ఈ సీజన్ ఉత్కంఠభరితంగా ఉండబోతుందని విశ్లేషకుల అంచనా. APL గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు ఈ సీజన్ కి ఐపీఎల్ నిర్వాహకులను ఆహ్వానించినట్టు తెలిపారు.
మైత్రి మూవీ మేకర్స్ సన్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి విజయవాడ సన్ షైనర్స్ జట్టును ప్రకటించింది. ఈ లీగ్ ఆంధ్రప్రదేశ్ లోని క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి కీలక అవకాశంగా ఉంది. ఈ సీజన్ కి ముఖ్య అతిథులుగా ఐపీఎల్ నిర్వాహకులను ఆహ్వానించడం జరిగింది. క్రీడాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు అభిప్రాయం వ్యక్తం చేసారు.
Readmore: https://teluguprabha.net/sports-news/rishabh-pant-nearer-to-breaking-this-elusive-record-in-tests/


