HomeఆటVinesh Phogat: యాంటీ డోపింగ్‌.. వినేశ్‌ ఫొగాట్‌కు షోకాజ్‌ నోటీసులు

Vinesh Phogat: యాంటీ డోపింగ్‌.. వినేశ్‌ ఫొగాట్‌కు షోకాజ్‌ నోటీసులు

Vinesh Phogat Anti- Doping: ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణారాహిత్యం, యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఆమెను జూన్ 26, 2026 వరకు దేశవాళీ పోటీల నుంచి బహిష్కరించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు పెరిగి అనర్హతకు గురవ్వడం ద్వారా దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం, డోపింగ్ పరీక్షలకు సంబంధించి ‘వేర్ ఎబౌట్స్’ విఫలం కావడం, మార్చి 2024 ట్రయల్స్‌లో రెండు వేర్వేరు బరువు విభాగాల్లో పోటీ పడటం వంటి 4 ప్రధాన అంశాలపై WFI వివరణ కోరింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/suvendu-adhikari-sworn-in-as-west-bengal-cm/

రిటైర్మెంట్ ప్రకటించి తిరిగి మ్యాట్‌పైకి అడుగుపెట్టే క్రీడాకారులు 6 నెలల ముందస్తు నోటీసు పీరియడ్ పూర్తి చేయాలనే (UWW యాంటీ డోపింగ్ రూల్స్) నిబంధనను పాటించలేదని WFI పేర్కొంది. ఈ చర్యతో గొండాలో మే 10-12 వరకు జరిగే ‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్’లో ఆమె పాల్గొనే అవకాశం కోల్పోయింది. ఈ మేరకు ఈ షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడానికి వినేశ్‌కు అధికారులు 14 రోజుల సమయం ఇచ్చారు. అంతకుముందు, మే 4న అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ITA) కూడా 2025 డిసెంబర్‌లో ఒకసారి డోపింగ్ పరీక్షకు అందుబాటులో లేనందుకు ఆమెకు నోటీసు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News