Wednesday, January 1, 2025
HomeఆటKoneru Humpy: కోనేరు హంపికి సీఎం చంద్రబాబు అభినందనలు

Koneru Humpy: కోనేరు హంపికి సీఎం చంద్రబాబు అభినందనలు

ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి(Koneru Humpy)ని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) అభినందించారు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమంటూ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరం భారతదేశ చెస్‌ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కూడా కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి భావితరాలకు హంపి స్ఫూర్తిగా నిలవాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News