Thursday, September 26, 2024
HomeఆటAP new sports policy: అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాల...

AP new sports policy: అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాల కల్పన

స్పోర్ట్స్ ఇన్ఫ్రా కోసం..

క్రీడా సౌకర్యాలు పరంగా అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని, అందరికీ క్రీడలు – వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, వాకర్స్ అసోసియేషన్‌లను ప్రారంభించి, గ్రామస్థాయిలో ఆట మైదానాలను, నియోజకవర్గస్థాయిలో క్రీడా వికాస కేంద్రాలను, జిల్లా స్థాయిలో జిల్లా క్రీడభివృద్ధి సంస్థలను, రాష్ట్రస్థాయిలో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ లు, అకాడమీలు, అదే విధంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే పథకాలను ఎన్డియే ప్రభుత్వం అమలు చేస్తుందని, సచివాలయంలో యువజన క్రీడా శాఖలపై జరిగిన సమీక్ష సమావేశం అనంతరం మీడియాకు తెలియజేశారు. రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
వైసిపి ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు హయంలో నూతన క్రీడా విధానాలతో క్రీడా ప్రతిభ వెలికి తీసి యువతకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. క్రీడా శాఖలో పదవీ విరమణ వయస్సు 60 – 62 వరకు పొడిగింపు అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. 2027 నాటికి జాతీయ క్రీడలు, ఖేలో ఇండియా గేమ్స్ మరియు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రణాళిక వేస్తూ కార్యాచరణ చేపడుతున్నామని, విశాఖపట్నం, అమరావతి & తిరుపతి 3 ప్రాంతాలలో సమీకృత క్రీడా సముదాయాలు పూర్తిస్థాయిలో క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని, క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవడానికి వర్ధమాన క్రీడాకారులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని.

- Advertisement -

ప్రజలను, ప్రభుత్వం , ప్రైవేటు వ్యవస్తలను సమీకృతం చేస్తూ
క్షేత్ర స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ, అభివృద్ధి కల్పనకు నమూనాలు ఏర్పాటు చేస్తున్నామాని, క్రీడా విధానం ద్వార యువత ఉపాధికి అనుసందానం చేసి వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తున్నామని, ఆటలను , క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే దిశగా స్పోర్ట్స్ పాలసీని రూపొందించమని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యా క్యాలెండర్, స్పోర్ట్స్ స్పేస్ వంటి అన్ని రంగాలను క్రీడలు క్రమశిక్షణలో ఉంచుతామని, సోలార్ పలకలు (పైకప్పులు) అన్ని స్టేడియంలలో ఏర్పాటు చేసి (విద్యుత్) పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం కొరకు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. క్రీడా యాప్ ద్వారా అన్ని సర్టిఫికేట్‌ల జారీ మరియు ధృవీకరణ – ప్లేయర్‌లు, కోచ్‌లు, అసోసియేషన్‌లు మొదలైన వాటి కోసం డేటాబేస్ నిర్వహిస్తున్నామని వెల్లడి చేసారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మరిన్ని పతకాలు సాధించడం కోసం సంఘాలు/ సమాఖ్యను ప్రోత్సహించండంపై విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలో క్రీడాకారులకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న క్రీడా వికాస కేంద్రాలను గడువులోగా పూర్తి చేసేవిధంగా అదేశించామని, కేంద్ర ప్రభుత్వ సహాయంతో యువజన క్రీడా సమగ్ర అభివృదికి సమగ్ర కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News