Friday, April 11, 2025
HomeఆటVennam Surkha met CM: ఏస్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను అభినందించిన జగన్‌

Vennam Surkha met CM: ఏస్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను అభినందించిన జగన్‌

ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో పలు పతకాలు సాధించిన జ్యోతి

భారత ఏస్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు జ్యోతి సురేఖ. ఇటీవల బెర్లిన్‌ లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్, ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో పలు పతకాలు సాధించిన జ్యోతి సురేఖను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్, తాను సాధించిన పతకాలను సీఎం వైఎస్‌ జగన్‌కు చూపారు సురేఖ.

- Advertisement -

అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై సురేఖను ప్రశంసించారు సీఎం వైఎస్‌ జగన్, తనకు డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సురేఖ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం, రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు సీఎం. సురేఖ తండ్రి వెన్నం సురేంద్ర కుమార్‌ కూడా జగన్ ను కలిసినవారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News