Sunday, November 16, 2025
HomeఆటArjun tendulkar :.సచిన్ ఇంట పెళ్లి సందడి.. టెండూల్కర్ ఇంటికి కోడలు రాబోతోంది!

Arjun tendulkar :.సచిన్ ఇంట పెళ్లి సందడి.. టెండూల్కర్ ఇంటికి కోడలు రాబోతోంది!

Arjun Tendulkar engagement : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఆయన తనయుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తండ్రి బాటలో క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అర్జున్, ఇప్పుడు తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ముంబైకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన యువతితో అర్జున్ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, టెండూల్కర్ ఇంటి కోడలు కాబోతున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి..?

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, ముంబై ఇండియన్స్ ఆటగాడు అయిన అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు తొలి అడుగు వేశాడు. బుధవారం (ఆగస్టు 13న) ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో సానియా చందోక్ అనే యువతితో అర్జున్ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఈ వేడుకలో అర్జున్, సానియా ఉంగరాలు మార్చుకుని తమ బంధాన్ని అధికారికంగా ఖరారు చేసుకున్నారు. అయితే, ఈ వేడుకకు సంబంధించి టెండూల్కర్ కుటుంబం నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

- Advertisement -

ఎవరీ సానియా చందోక్ : అర్జున్ టెండూల్కర్‌ను పెళ్లాడబోతున్న సానియా చందోక్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఎక్కువగా లో-ప్రొఫైల్ పాటించడానికి ఇష్టపడతారు. సానియా ముంబైలోని అత్యంత పలుకుబడి, గౌరవం ఉన్న వ్యాపార కుటుంబాలలో ఒకటైన ‘ఘాయ్’ ఫ్యామిలీకి చెందిన యువతి. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే ఈ సానియా. ఘాయ్ కుటుంబానికి ముంబైలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. వీరిలో ముఖ్యమైనవి ముంబైలోని ప్రఖ్యాత ‘ఇంటర్‌కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్’ హోటల్ మరియు తక్కువ కేలరీల ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌గా పేరుగాంచిన ‘బ్రూక్లిన్ క్రీమరీ’. ఇంతటి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలైనప్పటికీ, సానియా ప్రచారానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.

అర్జున్ టెండూల్కర్ కెరీర్ : లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా, బ్యాటర్‌గా రాణిస్తున్న 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్, దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్జున్, 33.51 సగటుతో 37 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 23.13 సగటుతో 532 పరుగులు కూడా చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అటు లిస్ట్-ఎ, టీ20లలో కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తండ్రి అంతటి గొప్ప పేరును నిలబెట్టేందుకు అర్జున్ అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న అర్జున్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad