జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నలుగురికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, 32 మందికి అర్జున అవార్డులు, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. అర్జున పురస్కారాలు(Arjuna Awards) దక్కించుకున్న వారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. ఇక అర్జున అవార్డులు అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు.
అథ్లెటిక్స్ విభాగంలో విశాఖకు చెందిన రన్నర్ యర్రాజి జ్యోతి(yarraji jyothi), పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జివాంజి దీప్తి(jivanji deepthi)లు అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు. కాగా జివాంజి దీప్తి పాఠాలంపిక్స్‌లో మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించగా.. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి తృటిలో పథకం చేజార్చుకున్నారు. ఇద్దరు తెలుగు క్రీడాకారులకు కేంద్రం అవార్డులు ప్రకటించడంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.