Sunday, November 16, 2025
HomeఆటArshdeep Singh: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా అర్ష్‌దీప్ సింగ్

Arshdeep Singh: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా అర్ష్‌దీప్ సింగ్

అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొడుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) మరో ఘనత సాధించాడు. ఇప్పటికే టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మరో 3 వికెట్లు తీస్తే భారత్ తరపున పొట్టి ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలుస్తాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే తాజాగా ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం సికిందర్ రజా (జింబాబ్వే), ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా), బాబర్ అజామ్‌ (పాకిస్థాన్‌)కూడా పోటీ పడ్డారు. అయితే చివరకు అర్ష్‌దీప్‌ను ఐసీసీ ఎంపిక చేసింది.

కాగా గతేడాది అర్ష్‌దీప్ 18 మ్యాచ్‌ల్లోనే 36 వికెట్లు పడగొట్టి భారత్‌ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లోనూ భారత్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 7.16 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అయితే (4/9) సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad