టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) టీ20ల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఇప్పటిదాకా యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు పడగొట్టి టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచులో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. చాహల్ రికార్డును బ్రేక్ చేశాడు. కేవలం 61 మ్యాచుల్లో 97 వికెట్లతో తొలి స్థానానికి చేరుకున్నాడు. ఇక వీరిద్దరి తరువాత ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, బుమ్రాలు ఉన్నారు.
ఇదిలా ఉంటే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టీమ్ సౌథీ కొనసాగుతున్నాడు. 126 మ్యాచ్‌లలో 165 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి టాప్-5లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ (161), బంగ్లాదేశ్ బౌలర్ షకీబ్ అల్ హసన్ (149), న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోధీ (138), బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (132) ఉన్నారు.