టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) టీ20ల్లో సరికొత్త రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. టీ20ల్లో మరో రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) 80 మ్యాచుల్లో 96 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
ఇక అర్ష్‌దీప్ సింగ్ 60 మ్యాచులు ఆడి 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో చాహల్ రికార్డును బ్రేక్ చేసేందుకు అర్ష్‌దీప్ రెడీ అయ్యాడు. అంతేకాకుండా మరో 5 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
యుజ్వేంద్ర చాహల్ – (80 మ్యాచ్‌లు, 96 వికెట్లు)
అర్ష్‌దీప్ సింగ్ – (60 మ్యాచ్‌లు, 95 వికెట్లు)
భువనేశ్వర్ కుమార్- (87 మ్యాచ్‌లు, 90 వికెట్లు)
జస్‌ప్రీత్ బుమ్రా – (70 మ్యాచ్‌లు, 90 వికెట్లు)
హార్దిక్ పాండ్య – (109 మ్యాచ్‌లు, 89 వికెట్లు)