Aryaveer Kohli DPL: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కుటుంబం నుంచి వారసుడు క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. కొద్దిరోజుల్లో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జట్టు తరఫున కోహ్లీ వారసుడు బరిలోకి దిగనున్నాడు. అయితే ఇతను విరాట్ కోహ్లీ లాగా బ్యాట్స్‌మన్ కాదు.. స్పిన్ బౌలర్. పేరు ఆర్యవీర్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అన్న వికాస్ కొడుకే ఆర్యవీర్. ఇతడ్ని ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ రూ.లక్షకి కొనుగోలు చేసింది. భారత మాజీ క్రికెటర్ శరణ్ దీప్ సింగ్ వద్ద ఇతను కోచింగ్ తీసుకున్నాడు.
ఆర్యవీర్ కోహ్లీ గురించి కోచ్ శరణ్‌దీప్ సింగ్ మాటల్లో.. “ఆర్యవీర్ కోహ్లీ ఒక అప్‌కమింగ్ క్రికెటర్. ఆర్యవీర్ చాలా టాలెండెడ్. ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా కష్టపడుతున్నాడు” అని తెలిపారు. ఆర్యవీర్ ప్రస్తుతం వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడ కోచ్ రాజ్ కుమార్ శర్మ దగ్గర కూడా శిక్షణ తీసుకున్నాడు. అయితే సౌత్ ఢిల్లీ టీమ్‌లో ఐపీఎల్ స్టార్ దిగ్వేష్ తో ఆర్యవీర్ కోహ్లీ కలిసి పనిచేయనున్నాడు.


