Ind vs Pak Controversy: ఆసియా కప్ లో భారత్, పాక్ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒకరిపై ఒకరు ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు. తాజాగా బీసీసీఐ పాకిస్తాన్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనపై ఐసీసీకి అధికారికంగా కంప్లైంట్ ఇచ్చింది. దాయాది బౌలర్లు అయిన హరీస్ రౌఫ్, బ్యాట్స్‌మెన్ సాహిబ్జాదా ఫర్హాన్ లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు బీసీసీఐ ఫిర్యాదు చేసింది.
సెప్టెంబరు 21న ఆసియా కప్ సూపర్-4 పోరులో బౌండరీ లైన్ వద్ద హరీస్ రౌఫ్ విమానం కూలిపోతున్నట్టు సైగ చేయడం భారత ఆర్మీ చర్యలను ఎగతాళి చేసినట్లు ఉందని.. అంతేకాకుండా బౌలింగ్ చేస్తూ..భ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలను తిట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు దాయాది బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌ను మెషిన్ గన్ లాగా పట్టుకొని గాల్లో కాల్చినట్టుగా సంబరాలు చేసుకోవడం కూడా విమర్శలకు దారితీసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి చేసిన ఫిర్యాదు ఆధారంగా రౌఫ్, ఫర్హాన్‌లు ఐసీసీ ప్రవర్తనా నియమావళి కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోపణలు రుజువైతే వీరిద్దరిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పీసీబీ రివర్స్
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థిపై భారత్ గెలిచింది. ఈ క్రమంలో సారథి సూర్యకుమార్ తమ జట్టు విజయాన్ని భారత సైన్యానికి, ఫహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇవ్వడం కూడా పొలిటికల్ స్టేట్మెంట్ గా పీసీబీ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కంప్లైట్ సరైన సమయంలో చేసిందా లేదా అనేది తేలాల్సి ఉంది.
Also Read: Abhishek Sharma -అభిషేక్ శర్మ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఆ వీడియో వివాదాన్ని పెంచింది..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వి చేసిన ఓ పని కూడా ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఆయన సోషల్ మీడియాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ సెలబ్రేషన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో రొనాల్డో విమాన ప్రమాదాన్ని సూచించేలా సైగ చేస్తున్నట్లు చూపించడం గమనార్హం. ఇది రౌఫ్‌ను సమర్థించే చర్యగా ఉంది.


