Chatgpt predicts India vs Pakistan playing 11: ఆసియా కప్ 2025లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం రాత్రి దుబాయ్‌లో జరగనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడటం ఇదే తొలిసారి. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ లో యూఏఈపై తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధిస్తే భారత్ నేరుగా సూపర్ 4 అర్హత సాధిస్తుంది. శుక్రవారం పాక్ కూడా తన మెుదటి మ్యాచ్ లో ఒమన్ పై విజయం సాధించి భారత్ కు పోరుకు ముందు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్ కోసం ఫ్లేయింగ్ 11ను ఎంపిక చేయాలని చాట్ జీపీటీని కోరగా.. ఇది ఈ కింది విధంగా జట్లను సెలెక్ట్ చేసింది.
పాక్ తో మ్యాచ్ లో సంజూ శాంసన్ స్థానంలో జితేష్ ను ఆడించాలని.. ఎందుకంటే అతడికి ఫినిషర్ గా మంచి పేరు ఉందని అది తెలిపింది. ఓపెనర్లుగా గిల్, అభిషేక్ నే కొనసాగించాలని పేర్కొంది. గత మ్యాచులో మూడు వికెట్లు తీసుకున్న దూబేను పక్కను పెట్టి అనుభవం ఉన్న ఆర్షదీప్ ను తీసుకోవాలని చాట్ జీపీటీ సూచించింది. స్పిన్నర్లుగా కులదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ను కొనసాగించాలని తెలిపింది. గత మ్యాచ్ లో కులదీప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా ఎలా ఉండాలో సూచించింది.
భారత జట్టు
శుభమాన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ జట్టు
సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ అలీ


