Shoaib Akhtar Message for Pakistan Team: 2025 ఆసియా కప్‌లో ఆదివారం( సెప్టెంబరు 28) నాడు దాయాదుల పోరు జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అతిథ్య ఇవ్వనుంది. ఇప్పటికే లీగ్ దశలో, సూపర్-4 పోరులో పాకిస్తాన్ పై గెలిచిన భారత్ ముచ్చటగా మూడోసారి తలపడేందుకు రెడీ అయింది.
అక్తర్ హై-వోల్టేజ్ కామెంట్
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెను దుమారం రేపుతున్నాయి. పాక్ జట్టు టీమిండియా గర్వాన్ని అణచివేసే ఉద్దేశ్యం ఉంటేనే మైదానంలోకి రండి అంటూ కామెంట్ చేశాడు. అక్తర్ చేసిన ఈ ప్రకటన పాక్ ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు కానీ మ్యాచ్ పట్ల ఉత్సాహాన్ని మాత్రం పెంచుతోంది. 41 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థులు ఇద్దరూ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.
టీమిండియాదే పైచేయి..
టీ20ల్లో భారత్, పాకిస్తాన్ టీమ్స్ 15 సార్లు తలపడగా.. టీమిండియా 11 మ్యాచుల్లో గెలవగా..పాక్ మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కీలకం కావచ్చు. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో అతడు ఆరు ఇన్నింగ్స్‌లలో 51.50 సగటుతో 204.63 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కూడా కీ రోల్ ప్లే చేయనున్నాడు. అతడు ఇప్పటికే 9.84 యావరేజ్ తో 13 వికెట్లు పడగొట్టాడు.
Also read: Asia Cup 2025-ఫైనల్ కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు..
టీమిండియా:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి
పాకిస్తాన్:
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్


