Massive Injury Scare For Team India: ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 28న జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తుంది. శ్రీలంక మ్యాచ్ లో పలువురు ఆటగాళ్లు గాయాలు పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. భారత స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆడటం టీమిండియాకు చాలా ముఖ్యం.
అందుతున్న సమాచారం ప్రకారం, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా శ్రీలంక ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేయగానే తర్వాత మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ కు రాలేదు. లంకతో మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ చేతి నొప్పి కారణంగా ఫీల్డింగ్ కు రాలేదు. మరోవైపు యువ బ్యాటర్ తిలక్ వర్మ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్ కు ముందు గాయాల పాలవ్వడం టీమిండియా శిభిరంలో ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ కూడా స్పందించారు.
Also Read: Saim Ayub -టీ20ల్లో చెత్త రికార్డును మూటగట్టుకున్న పాకిస్థాన్ స్టార్ బ్యాటర్.. అదేంటో తెలుసా?
లంకతో పోరులో మా ఆటగాళ్లకు కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే ఫైనల్‌కు ముందు ఒక రోజు మాత్రమే విశ్రాంతి ఉంది. ఈ సమయంలోనే మా ఆటగాళ్లు పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. వారు తుదిపోరులో పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతారని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మ ఇప్పటికే గాయం నుండి కోలుకున్నాడని..హార్థిక్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని మోర్కెల్ పేర్కొన్నాడు. తిలక్ వర్మ గాయం గురించి మాత్రం మోర్కెల్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని జట్టు జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.


