Ind Vs Pak Final Asia Cup 2025: టీమిండియా బౌలర్ల ధాటికి పాకిస్థాన్ జట్టు కుదేలయింది. పవర్ ప్లేలో తేలిపోయినా తర్వాత పుంజుకున్న బౌలర్లు.. పాకిస్థాన్‌కు గట్టి షాక్‌లు ఇచ్చారు. వరుసగా వికెట్లు తీస్తూ దాయాది జట్టును ఇరకాటంలో పడేశారు. ఇంకా 5 బాల్స్ మిగిలి ఉండగానే పాక్ జట్టు 146 స్కోరుతో ఆలౌట్ అయింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్- 2025 ఫైనల్‌లో భారత బౌలర్లు విజృంభించారు. వరుస వికెట్లతో దాయాది జట్టును మట్టి కరిపించి 5 బాల్స్ మిగిలి ఉండగానే తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అయితే మ్యాచ్ ఆరంభంలో పాకిస్థాన్ 10 ఓవర్ల వరకూ దూకుడు కొనసాగించినా.. తర్వాత టీమిండియా బౌలర్లు మ్యాజిక్ చేయడంతో పాకిస్థాన్ స్కోర్‌కు బ్రేక్ పడింది.
Also Read: https://teluguprabha.net/sports-news/today-asia-cup-2025-final-match-between-india-vs-pak/
పవర్ ప్లే తర్వాత జోరు కొనసాగించి హాఫ్ సెంచరీ బాదిన ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(57)ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. సిక్సర్ బాదిన ఫర్హాన్ అదే ఊపులో పెద్ద షాట్ ఆడి తిలక్ వర్మ చేతికి చిక్కాడు. దాంతో.. ఎట్టకేలకు వికెట్ లభించడంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకుని దూకుడు కొనసాగించారు. ఫఖర్ జమాన్( 25), ఫర్హాన్ ద్వయం తొలి వికెట్‌కు కేవలం 58 బంత్లులోనే 84 పరుగులు జోడించింది.
కుల్‌దీప్ యాదవ్ మాయాజాలంతో పాక్ బ్యాటర్లు కుదేలయ్యారు. 17వ ఓవర్‌లో విజృంభించిన కుల్‌దీప్.. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి పాక్ జట్టు కుప్పకూలేలా చేశాడు. కుల్‌దీప్ 4 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, అక్షర్, బుమ్రా తలో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. బుమ్రా వేసిన చివరి ఓవర్ తొలి బంతికి పెద్ద షాట్ ఆడిన నవాజ్ (6) బౌండరీ వద్ద రింకూ సింగ్ చేతికి చిక్కాడు. దాంతో, పాక్ 146 పరుగులకే ఆలౌటయ్యింది.


