Asia Cup 2025, IND vs PAK: ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో భారత జైతయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్ 4లో అడుగుపెట్టింది. అయితే టీమిండియాను ఒక విషయం కలవరపెడుతోంది. ఏంటంటే టీ20 ఆసియా కప్ చరిత్రలో సూపర్-4 దశలో భారత్ రికార్డు అంత గొప్పగా లేదు. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
టీ20 ఆసియా కప్ హిస్టరీలోనే కేవలం ఒక్కసారి మాత్రమే సూపర్-4 ఫార్మాట్‌లో టోర్నీ నిర్వహించారు. 2022 కప్ లో టీమిండియా సూపర్-4లో మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోయి ఆసియా కప్ నిష్క్రమించింది. ఈ సారి సూర్య సేనా బలంగా ఉన్నప్పటికీ గత రికార్డు అభిమానులను ఆందోళనలో పడేస్తున్నాయి. ఈసారి సూపర్-4లో భారత్, పాక్ లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ నేడు(సెప్టెంబరు 21) జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత రికార్డును తిరగరాయాలని భావిస్తోంది భారత్.
మరోవైపు భారత్ తో మ్యాచ్ అంటేనే పాకిస్థాన్ వణుకుపోతుంది. ఎందుకంటే లీగ్ దశలో టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది పాక్. మళ్లీ సూపర్-4లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందనే ధీమాతో ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్. భారత్ తో మ్యాచ్ లో ఒత్తిడి జయించలేక చిత్తు అవుతున్నారు దాయాది ఆటగాళ్లు. ఈసారి ఎలాగైనా గెలిచి లెక్క సరి చేయాలని భావిస్తోంది చిరకాల ప్రత్యర్థి. టీమ్ లో ఉత్సాహం నింపడానికి ఓ మోటివేషనల్ స్పీకర్‌ను కూడా పాక్ జట్టు పెట్టుకున్నట్లు సమాచారం. ఆసియా కప్ 2025లో భారత్, పాక్ మ్యాచ్ తో సూపర్ ఫోర్ ఫైట్ మెుదలుకానుంది.
Also Read: Asia Cup 2025-చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా..
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, రింకు సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షదీప్ సింగ్,
పాకిస్థాన్ జట్టు: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రర్ అహ్మద్, హుస్సేన్ తలాత్, హసన్ వాఫ్ తలాత్, హసన్ అలీ, ఖుస్ వామ్ అలీ, కె. జూనియర్, సల్మాన్ మీర్జా


