Asia Cup, India vs Pakistan: ఆసియా కప్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈ వేదికగా జరుగనుంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో.. ఈసారి ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి ఆసియా కప్ లో అందరూ ఎదురుచూడబోతున్న మ్యాచ్ సెప్టెంబరు 14న దుబాయ్ వేదికగా జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. మరి ఈసారి దాయాదుల పోరులో గెలుపెవరిదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ లు ఎన్ని సార్లు తలపడ్డాయి, ఎవరి పైచేయి సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ అభిమానుల ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మ్యాచుల్లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి. అయితే ఆసియా కప్ హిస్టరీలో ఈ రెండు జట్లు 18 సార్లు తలపడ్డాయి. ఇందులో పది విజయాలతో టీమిండియా ముందుంజలో ఉండగా..పాకిస్థాన్ ఆరు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. మరో రెండు మ్యాచుల్లో ఫలితం రాలేదు. ఆసియా కప్ యొక్క టీ20 ఫార్మాట్‌లో ఇరుజట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ రెండు, పాక్ ఒక మ్యాచ్ లోనూ విజయం సాధించాయి. వన్డే ఫార్మాట్‌లో 15 సార్లు తలపడ్డాయి. భారత్ ఎనిమిది, పాకిస్థాన్ ఐదు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. మెుత్తంగా ఆసియా కప్ చరిత్రను పరిశీలిస్తే..టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: Asia Cup 2025 – ఆసియా కప్ హిస్టరీలో ఎక్కువ టైటిళ్లు గెలిచింది ఎవరో తెలుసా?
ఆసియా కప్ కు ఈ రెండు ర్రోజుల్లోనే భారత జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఈ మెగా టోర్నమెంట్ లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఇండియా, పాకిస్థాన్, యూఏఈ, ఓమన్ జట్లు గ్రూప్-ఏలో..ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్ కాంగ్ జట్లు గ్రూప్-బిలో ఉండనున్నాయి. ఈసారి జరగబోయేది 17వ పురుషుల ఆసియా కప్. మ్యాచ్ లన్నీ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మరియు అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో టీ20 ఫార్మాట్ లో జరుగుతాయి.
Also Read:Asia Cup 2025 – ఆసియా కప్ కు భారత జట్టు ఇదే..!


