Saturday, November 15, 2025
HomeఆటAsia cup 2025: బీసీసీఐ దెబ్బకు దిగివచ్చిన పాక్.. కప్‌ ఇచ్చేందుకు సిద్ధమన్న నఖ్వీ

Asia cup 2025: బీసీసీఐ దెబ్బకు దిగివచ్చిన పాక్.. కప్‌ ఇచ్చేందుకు సిద్ధమన్న నఖ్వీ

- Advertisement -

Asia Cup Trophy 2025 : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఆసియా కప్ 2025 వివాదంలో బీసీసీఐకు క్షమాపణలు తెలియజేశాడు. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు గెలిచింది. ఈ క్రమంలో ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. అప్పటికే నఖ్వీ ఒక అరగంట పాటు వెయిట్ చేసిన భారత ఆటగాళ్లు ఆయన చేతుల మీదుగా కప్తీసుకునేందుకు వెళ్లలేదు. దీంతో ట్రోఫీ లేకుండానే టీమిండియా ఆటగాళ్లు విన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు వెళ్లకపోవడంతో.. అతను దాన్ని తన వెంటే తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆసియా కప్ 2025 ట్రోఫ్రీ నఖ్వీ దగ్గరే ఉంది. కప్‌ ఇవ్వాలని బీసీసీఐ నక్వీని కోరగా.. భారత్కు ఈ ట్రోఫీని అప్పగించేందుకు అతడు మెలికలు పెట్టాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు మాత్రమే ఈ కప్ను అప్పగిస్తానని… అతడే స్వయంగా తన (ఏసిసి) కార్యాలయానికి వచ్చి ట్రోపీ అందుకోవాలని కోరాడు. దీంతో వివాదం చెలరేగింది. కండీషన్కు బీసీసీఐ ససేమిరా అంది. లీగల్గా పోరాడి ఈ ట్రోఫీని ఎలా తెచ్చుకోవాలతో తమకు తెలుసని బీసీసీఐ ప్రతినిధులు ఘాటుగా జవాబిచ్చారు. నఖ్వీ తీరుపై ఐసీసీ ఫిర్యాదు చేసేందుకు బిసీసీఐ సిద్దమయ్యింది.

భారత కెప్టెన్కు మాత్రమే కప్ఇస్తా..

మంగళవారం జరిగిన ఏజీఎంలో నఖ్వీ కొనసాగిస్తున్న ‘ట్రోఫీ డ్రామా’పై శుక్లా, షెలార్‌ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది ఏసీసీ ట్రోఫీ. ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. టోర్నీలో గెలిచిన విజేత జట్టుకే అప్పగించాలి’ అని రాజీవ్‌ శుక్లా గట్టిగానే స్పష్టం చేశారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఏజీఎంలో ఇంత జరుగుతున్నా… భారత్‌ నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వెల్లువెత్తుతున్నా… ఏసీసీ అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వీ మాత్రం తన మొండి పట్టు వీడలేదు. ట్రోఫీని ఇచ్చేందుకు సమావేశంలో అంగీకరించలేదు.అయితే, ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని నఖ్వీ దాటవేశారు. ఏసీసీ ఎజెండాలోని వైస్చైర్మన్ఎన్నిక వరకేమీటింగ్‌ను పరిమితం చేయాలని చూశారు. అంతేకాదు. వెస్టిండీస్‌పై నేపాల్సంచలన విజయం పట్ల నేపాల్జట్టును అభినందించారు. నేపాల్ఆసియా జట్టు కావొచ్చు. కానీద్వైపాక్షిక సిరీస్ఏసీసీకి సంబంధించిన టోర్నీ కానేకాదు. అయినా నేపాల్‌ను ప్రశంసించిన నఖ్వీఏసీసీ సొంత టోర్నీ అయిన ఆసియా కప్గెలిచిన భారత్‌ను మాటమాత్రంగానైనా అభినందించకుండా తన కుటిల బుద్ధిని చాటుకున్నారు. నక్వీతో పాటు కెప్టెన్సల్మాన్ఆఘాపై ఐసీసీలో ఫిర్యాదు చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ రావడంతో ఎట్టకేలకు నక్వీ దిగొచ్చి క్షమాపణలు చెప్పాడు. ట్రోఫీ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటన విడుదల చేశాడు. కానీ ఇంకొంచెం ఈగో ప్రదర్శిస్తూ తన చేతుల మీదుగానే కేవలం ఇండియా కెప్టెన్కు మాత్రమే ట్రోఫీని అప్పగిస్తానని తెలిపాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad