Asia Cup 2025 Trophy Controversy: పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయినా ఇప్పటికీ భారత జట్టుకు ట్రోఫీ అందలేదు. దీని కారణం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత జట్టు ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడమే. గెలిచిన వారికి ట్రోఫీ అందించే తొలి అధికారం రూల్స్ ప్రకారం, ఏసీసీ చీఫ్‌కే ఉంది. పైగా నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడిగా ఉండటంతోపాటు పీసీబీ ఛైర్మన్ గా వ్యవహారిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాక్ ప్రభుత్వంలో హోం మంత్రి హోదాలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేని కారణంగా భారత్ జట్టు దాయాది మంత్రి చేతులో మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ట్రోఫీ భారత జట్టు వద్దకు చేరకపోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై బీసీసీఐ యాక్షన్ షురూ చేసింది.
మొహసిన్ నఖ్వీ చేతుల మీద కాకుండా యూఏఈ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ద్వారా ఇప్పించాలని బీసీసీఐ కోరింది. దీంతో నిరాశ చెందిన ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని తన హోటల్‌కు వెళ్లిపోయాడు. అతడు వ్యవహారించిన తీరు బీసీసీఐకి కోపం తెప్పించింది. బాధ్యతగా వ్యవహారించాల్సిన నఖ్వీ ఇలా ప్రవర్తించడం బీసీసీఐ జీర్ణించుకోలేకపోయింది. దీంతో అతడి వైఖరిపై బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది.
Also Read: Ind vs Pak Final -తిలక్ వర్మ కొట్టిన భారీ సిక్స్‌కు గంభీర్ రియాక్షన్ చూశారా?
బీసీసీఐ ఏమన్నాదంటే..
ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. నఖ్వీకి తన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాం. ట్రోఫీని త్వరలోనే తమ జట్టుకి తిరిగి ఇస్తాడని ఆశిస్తున్నామని సైకియా అన్నారు. ఒకవేళ నఖ్వీ అలా చేయకపోతే ఏం చేయాలో చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ వివాదంపై నవంబర్‌లో దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అంటే నఖ్వీ భారత జట్టుకు కప్ తిరిగి ఇవ్వడానికి అక్టోబర్ చివరి వరకు మాత్రమే సమయం ఉంది.
Also Read: Ind vs Pak final -‘యుద్ధభూమిలోనైనా.. మైదానంలోనైనా టీమిండీయాదే విజయం’..: ప్రధాని మోదీ


