Sunday, February 8, 2026
HomeఆటAsian Games 2026: గుడ్‌న్యూస్‌.. ఆసియా క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది.. మెన్స్, ఉమెన్స్‌‌ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

Asian Games 2026: గుడ్‌న్యూస్‌.. ఆసియా క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది.. మెన్స్, ఉమెన్స్‌‌ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

Asian Games Schedule Release 2026: క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆసియా క్రికెట్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 ఫార్మాట్‌లోని ఆసియా క్రీడల్లో ఈసారి క్రికెట్ కూడా ఉంది. క్రికెట్‌తో సహా కొన్ని విభాగాల మ్యాచ్‌లు ముందే ప్రారంభమవుతాయని ఐచి-నగోయా ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ బుధవారం (జనవరి 14) విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం, ఆసియా ఉమెన్స్ క్రికెట్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్ 17న, గోల్డ్ మెడల్ మ్యాచ్ సెప్టెంబర్ 22న జరగనుంది. మెన్స్ క్రికెట్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 3న గోల్డ్ నాదల్ మ్యాచ్ జరగనుంది. ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో భారత్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది. 2023 మాదిరిగానే 2026 ఆసియా క్రీడల్లో సీనియర్లు ఆసియా గేమ్స్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బీసీసీఐ యంగ్ ఇండియాను ఈ టోర్నీ కోసం పంపనున్నట్టు సమాచారం.

- Advertisement -

మహిళల క్రికెట్ షెడ్యూల్..

మహిళల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 17న క్వార్టర్ ఫైనల్స్‌తో ప్రారంభమై సెప్టెంబర్ 22న బంగారు పతక పోటీతో ముగుస్తాయి. అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం, ఉదయం 5:30 గంటలకు అదేవిధంగా 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

సెప్టెంబర్ 17: క్వార్టర్-ఫైనల్స్ 1 అండ్ 2

సెప్టెంబర్ 18: క్వార్టర్ ఫైనల్స్ 3 అండ్ 4

సెప్టెంబర్ 20: సెమీ-ఫైనల్స్

సెప్టెంబర్ 22: కాంస్య పతక మ్యాచ్, గోల్డ్ మెడల్ మ్యాచ్

పురుషుల క్రికెట్ షెడ్యూల్..

పురుషుల టోర్నమెంట్ సెప్టెంబర్ 24న ప్రిలిమినరీ క్వాలిఫయర్స్‌తో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 3 వరకు కొనసాగుతుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం ఉదయం 5:30 గంటలకు అదేవిధంగా 10:30 గంటలకు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్ 24–26: ప్రిలిమినరీ క్వాలిఫయర్స్

సెప్టెంబర్ 28–29: క్వార్టర్-ఫైనల్స్

అక్టోబర్ 1: సెమీ-ఫైనల్స్

అక్టోబర్ 3: కాంస్య పతక మ్యాచ్, గోల్డ్ మెడల్ మ్యాచ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News