Monday, December 9, 2024
HomeఆటAsifabad: ముగిసిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు

Asifabad: ముగిసిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు

ఆదిలాబాద్ ఛాంపియన్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా బాలికల పాఠశాలలో గత మూడు రోజులుగా క్రీ.శే. గడిగొప్పుల సదానందం పిడి జ్ఞాపకార్థం జరుగుతున్న 38వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీలు ముగిశాయి.

- Advertisement -

ఈ పోటీలో మహబూబ్ నగర్ జట్టుకు ఆదిలాబాద్ జట్టుకు ఫైనల్ మ్యాచ్ జరగగా 23-17 గోల్స్ తో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజయం సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా స్థానిక సీఐ రవిందర్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్యామల పవన్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కనపర్తి రమేష్, మాజీ ఎంపీపీ ఆరిగెల మల్లికార్జున్ యాదవ్, గిరిజన క్రీడల అధికారి బండ మీనారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునార్కర్ అరవింద్ హాజరై, బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ కడతల రాకేష్, ఏ సి ఎం ఓ ఉద్ధవ్,పాఠశాల ఎచ్.ఎం జంగు,కోచ్ లు విద్యాసాగర్, రవి తిరుమల్, పిడి విశాల, పీఈటీలు రాజలింగు, కళ్యాణ్, సాయి, రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ శ్యామ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాసాడేచరణ్, యాదగిరి,గోకుల్, రవి, లక్మన్, మంగా, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News