తెలంగాణ రాష్ట్ర ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 15, 16 తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆథ్లెటిక్స్ అండర్ 20 మహిళలు, పురుషుల విభాగాలలో ఖమ్మం జిల్లా క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనపరిచి, 4 బంగారు పథకాలు, 3 రజత పథకాలు, 2 కాంస్య పథకాలు సాధించి, రాష్ట్రస్థాయిలో ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా యువజన, క్రీడల అధికారి పరందామ రెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఖమ్మం చైర్మన్ నున్నా రాధాకృష్ణ, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఖమ్మం అధ్యక్షుడు మందుల వెంకటేశ్వర్లు, అథ్లెటిక్స్ కోచ్ ఎండి గౌస్ సంఘ ప్రధాన కార్యదర్శి ఎండి షఫీక్ అహ్మద్, కోశాధికారి సుధాకర్, కృష్ణయ్య, నక్క వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, హలీం, త్రివేణి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా క్రీడాకారులను అభినందించారు.
క్రీడాకారుల వివరాలు:
1} A.MITHILI-
400mts-Gold,
2} B.INDU PRIYA-
400mts-Silver
800mts-Silver
3} P.KMAKSHI-
400mts Hordls-Silver
4} P.NAGAMANI-
Long Jump- Bronge
5} VIVEK CHANDRA-
110mts Hordls-Gold
6} SK.LAL PASHA-
100mts-Gold
200mts-Gold
7} DINESH KARTHIK-
100mts-Bronge