Friday, January 16, 2026
HomeఆటAshes 2025-26: ఖవాజాకు అదిరిపోయే వీడ్కోలు.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం..

Ashes 2025-26: ఖవాజాకు అదిరిపోయే వీడ్కోలు.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం..

Aus vs Eng 05th Test Highlights: ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26 సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ యువ సంచలనం జాకబ్ బెథెల్ అద్భుత సెంచరీతో పోరాడినప్పటికీ.. అది ఇంగ్లాండ్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయింది.

- Advertisement -

బెథెల్ వీరోచిత సెంచరీ..
ఐదో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో యువ ఆటగాడు జాకబ్ బెథెల్ (154) తన కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతని పోరాటంతో ఇంగ్లాండ్ 342 పరుగులు చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 160 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.

నిలకడగా ఆస్ట్రేలియా
ఛేజింగ్‌లో ఒక దశలో ఆస్ట్రేలియా 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ మరోసారి నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను వణికించాడు. అయితే, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

సిరీస్ హైలైట్స్:
ఈ యాషెస్ సిరీస్ ఆద్యంతం ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగింది. స్టీవ్ స్మిత్ సారథ్యంలో తొలి రెండు టెస్టులు, పాట్ కమిన్స్ సారథ్యంలో మూడో టెస్టును గెలిచింది కంగూరు జట్టు. అయితే నాలుగో టెస్టులో జోష్ టంగ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ పుంజుకుని వైట్‌వాష్ ప్రమాదాన్ని తప్పించుకుంది. ఐదో టెస్టు గెలుపుతో ఆసీస్ 4-1తో ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది.

Also Read: Tilak Varma -వరల్డ్ కప్ కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో తిలక్ వర్మ దూరం!

ఖవాజా వీడ్కోలు
ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు చివరిది. తన సుదీర్ఘ కెరీర్‌కు ఖవాజా భావోద్వేగపూరిత వీడ్కోలు పలికాడు. మరోవైపు, ఈ సిరీస్ పొడవునా 31 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు.

Also Read: Vaibhav Suryavanshi – ‘పుష్ప’ స్టైల్‌లో వైభవ్ విధ్వంసం.. 10 సిక్సర్లు, 9 ఫోర్లతో ఊచకోత!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News