AUS vs IND 2025 T20I Series: ఈ ఏడాది ఆసియా కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా తొలి టీ20 సిరీస్ ఆస్ట్రేలియాతో ఆడబోతుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమ్ ఇండియా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఇటీవల మూడు వన్డేల సిరీస్ లో ఆసీస్ చేతిలో 2-1తో ఓడిపోయిన తర్వాత భారత జట్టు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ టూర్ లో సూర్యా సేన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడబోతుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు ఈ సిరీస్ సన్నాహాకంగా ఉండబోతుంది.
మ్యాచ్ ఎన్ని గంటలకు?
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ అక్టోబర్ 29న కాన్‌బెర్రాలో జరగబోతుంది. భారత కాలమానం ప్రకారం, ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు (స్థానిక సమయం రాత్రి 7:15 గంటలకు) ప్రారంభమవుతుంది. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కూడా అన్ని ఫార్మాట్లలో స్థిరంగా ఉంది.
తుది జట్టులో ఎవరు ఉండొచ్చు?
ప్రపంచ నం 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. నం. 2 ర్యాంకర్ తిలక్ వర్మ మూడో స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాల్గో స్థానంలో, వికెట్ కీపర్ సంజు సామ్సన్ 5వ స్థానంలో ఆడతాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దూరమవడంతో అతడి స్థానంలో నితీష్ కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. శివం దుబేకు కూడా తుదిజట్టులో స్థానం దక్కవచ్చు. ఆల్ రౌండర్‌గా అక్షర్ పటేల్ స్థానం దక్కవచ్చు. ఆసియా కప్ హీరో కుల్దీప్ యాదవ్ కు చోటు పక్కా. వరుణ్ చక్రవర్తి కూడా ఫ్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. బుమ్రా తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాల్లో ఎవరో ఒకరికి ఫ్లేస్ లభించవచ్చు.
Also Read: Shreyas Iyer – టీమిండియాకు బిగ్ షాక్.. ICUలో శ్రేయాస్ అయ్యర్..!
ఇరు జట్లు
భారత్ జట్టు: శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాట్ షార్ట్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్


