HomeTop StoriesT20 World Cup: నేడు మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఏడోసారి కప్‌పై కన్నేసిన...

T20 World Cup: నేడు మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఏడోసారి కప్‌పై కన్నేసిన ఆసీస్

T20 World Cup final: మహిళల టీ20 ప్రపంచ కప్ సమరం చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ తుది పోరులో బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళల జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా.. అజేయంగా ఫైనల్‌కు దూసుకొచ్చిన ఈ రెండు జట్లు ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.

- Advertisement -

ఏడోసారి కప్‌పై కన్నేసిన ఆసీస్: మహిళల క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆస్ట్రేలియా.. ఈ ఫైనల్లోనూ గెలిచి రికార్డు స్థాయిలో ఏడోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంతో ఉన్న ఆసీస్ జట్టును అడ్డుకోవడం ప్రత్యర్థికి అంత సులువు కాదు. మరోవైపు, ఇంగ్లాండ్ మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉంది. సుమారు 17 ఏళ్ల తర్వాత ఎలాగైనా మరోసారి ప్రపంచ కప్ విజేతగా నిలవాలనే లక్ష్యంతో ఇంగ్లాండ్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఆసీస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇంగ్లాండ్ జట్టు సర్వశక్తులూ ఒడ్డనుంది.

Also Read-India Vs England: హాఫ్‌ సెంచరీతో చెలరేగిన బెతెల్‌.. భారత్‌పై ఇంగ్లాండ్‌ ఘన విజయం

టాస్ గెలిచినోడిదే మ్యాచ్!: రెండు జట్లు సమాన బలాబలాలతో ఉండటంతో ఈ మ్యాచ్ పతాక స్థాయి ఉత్కంఠను రేకెత్తించనుంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ‘టాస్’ అత్యంత కీలకంగా మారనుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా టాస్ గెలిచిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు.మరి ఈ రాత్రి జరిగే హై-డ్రామా పోరులో విజయం ఎవరిని వరిస్తుందో? ఆసీస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందో, లేక ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందో చూడాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News