AUS vs IND| నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్- ఆసీస్ జట్ల మధ్య బోర్డర్-గవారస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు ఐదు టెస్టులు ఆడనున్నాయి. ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఆస్ట్రేలియా బోర్టు తన జట్టును ప్రకటించింది. 13 మందితో ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. పాట్ కమిన్స్(Pat Cummins) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులోకి కొత్త ప్లేయర్ నాథన్ మెక్‌స్వీనేను ఎంపిక చేయగా.. కామెరూన్ గ్రీన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్
ఇక ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా తొలి బృందం ఇవాళ బయల్దేరింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తొలి టెస్టులో ఆడటంపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు తుది జట్టులో కేఎల్ రాహుల్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్
రిజర్వ్ ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైని, ఖలీల్ అహ్మద్