Former Australian cricketer Bob Simpson Passes away: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ బాబ్ సిమ్సన్ (89) కన్నుమూశారు. 1957 నుంచి 1978 వరకు 62 టెస్టులు ఆడిన ఆయన 4,869 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 39 టెస్టులకు సారథిగా కూడా వ్యవహారించాడు. అంతేకాకుండా 71 వికెట్లు కూడా తీశారు. అతడు రెండు వన్డేలు కూడా ఆడాడు. ఇతడు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసినప్పుడు సింప్సన్ వయసు కేవలం 16 సంవత్సరాలు.
వరల్డ్ కప్ ను అందించాడు..
1968లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సిమ్సన్.. 1977లో 41 ఏళ్ల వయసులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. కానీ తర్వాత సంవత్సరం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం 1986 నుండి 1996 వరకు ఆస్ట్రేలియా కోచ్ గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా కోచ్ గా పనిచేశారు. ఆయన కోచింగ్ లోనే కంగూరు జట్టు 1987 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ గెలిచింది.
Also read: West Indies Vs Pakistan- చరిత్ర సృష్టించిన కరేబియన్ జట్టు.. 34 ఏళ్ల తర్వాత పాక్ పై తొలిసారి..!
గొప్ప స్లిప్ ఫీల్డర్..
సింప్సన్.. బిల్ లారీతో కలిసి 1965లో వెస్టిండీస్‌పై రికార్డు స్థాయిలో 382 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఇతడు గొప్ప స్లిప్ ఫీల్డర్ కూడా. సింప్సన్ 110 క్యాచ్‌లు పట్టాడు. ఇవాళ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే మ్యాచ్‌కు ముందు ఆసీస్ సింప్సన్‌కు నివాళులర్పించబోతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అతడు జ్ఞాపకార్థం ఆటగాళ్లు చేతికి నల్లటి బ్యాండ్‌లు ధరిస్తారు.
Also Read: Arjun Tendulkar engagement – క్రికెటర్ అర్జున్ టెండూల్కర్
ప్రధాని నివాళి..
1957లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సింప్సన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మెుదలైంది. 1964లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన యాషెస్ టెస్ట్‌లో సింప్సన్ తన తొలి సెంచరీని నమోదు చేశాడు.ట్రిపుల్ సెంచరీ చేసిన ఏడుగురు ఆస్ట్రేలియన్లలో సింప్సన్(311)ఒకరు. ఈ క్రికెట్ దిగ్గజానికి ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ నివాళులర్పించారు. క్రికెట్ కు సింప్సన్ చేసిన సేవలు జీవితాంతం గుర్తిండిపోతాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని అన్నారు. సింప్సన్ 2013లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కించుకున్నారు.


