Saturday, November 15, 2025
HomeఆటAUS vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. ఆస్ట్రేలియా స్కోర్ 9/1

AUS vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. ఆస్ట్రేలియా స్కోర్ 9/1

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న చివరి టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మెన్లు ఆసీస్ పేసర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

- Advertisement -

వికెట్ కీపర్ రిషభ్ పంత్ (40) మినహా మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక రవీంద్ర జడేజా (26), శుభ్‌మన్ (20), బుమ్రా (22) తమ వంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ (17), వాషింగ్టన్ సుందర్ (14), యశస్వి జైస్వాల్ (10) పరుగులు సాధించారు. నితీశ్ డకౌట్‌ కాగా.. కేఎల్ రాహుల్ (4) విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, నాథన్‌ లైయన్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ కొన్‌స్టాస్‌ (7*) బుమ్రాతో వాగ్వాదానికి దిగబోయాడు. అంపైర్‌, ఖవాజా కలగజేసుకోవడంతో వివాదం సర్దుమణిగింది. అయితే ఆ తర్వాతి బంతికే బుమ్రా ఖవాజా(2) వికెట్ తీసి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad