మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో(AUS vs IND) ఆస్ట్రేలియా ఆటగాళ్లు పట్టుబిగించారు. ఓవర్ నైట్ స్కోర్ 358/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మరో 11 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 105 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ప్లేయర్లు నిలకడగా ఆడటం మొదలుపెట్టారు. అయితే బుమ్రా విజృంభించండంతో 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కానీ టెయిలెండర్లు నాథన్ లైయన్ (41), స్కాట్ బోలాండ్ (10) క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ముప్పుతిప్పల పెట్టారు. వీరిద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 228/9 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (70), పాట్ కమిన్స్ (41) రాణించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఒక వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది.