బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 141/6 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 145 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (8), సుందర్ (6) ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తొలి ఓవర్‌లోనే నాలుగు ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో 22 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక శుభ్‌మన్ గిల్ (13), కేఎల్ రాహుల్ (13), విరాట్ కోహ్లీ(9) మరోసారి విఫలమయ్యారు.
అయితే అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(Risabh Pant) దుమ్మురేపాడు. తొలి బంతి నుంచే ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇదే ఊపులో ఆడుతుండగా 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగుల వద్ద వికెట్ పారేసుకున్నాడు. ఆసీసీ బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు, కమిన్స్, వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులు చేయగా.. ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది.