AUS vs IND: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy 2024) భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 405/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 40 పరుగులు చేసి 445 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 6, సిరాజ్ 2, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు.
ఇక బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఓపెనర్ జైశ్వాల్(4), గిల్(1), కోహ్లీ (3) పరుగులతో వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ కూడా 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఆచితూచి ఆడుతూ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు రోహిత్ శర్మ(0) క్రీజులో ఉన్నాడు.
అయితే వర్షం పలు మార్లు మ్యాచ్‌కు ఆటంకం కలిగించడంతో కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 51/4గా ఉంది. ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 195 రన్స్ చేయాలి. మరి నాలుగో రోజు ఆటలో మిగిలిన భారత ఆటగాళ్లు ఆసీసీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పోరాడతారా..? లేక చేతులు ఎత్తేస్తారా..? అనేది చూడాలి.