Wednesday, June 4, 2025
HomeఆటGlenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్

Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 2027 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు ఆడేందుకు నా శరీరం సహకరించడం లేదు. నా స్థానంలో యువ ఆట‌గాళ్ల‌కు ఛాన్స్‌లు ఇచ్చి.. వారు కుదురునేలా సమయం ఇవ్వాలి’ అని పేర్కొన్నాడు.

- Advertisement -

36 ఏళ్ల మాక్స్‌వెల్ ఆగస్టు 2012లో వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం 149 వన్డే మ్యాచ్‌లు ఆడి 126.7 స్ట్రైక్ రేట్‌తో 3,990 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో 5.46 ఎకానమీ రేటుతో 77 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా రెండు సార్లు వన్డే ప్రపంచకప్ (2015, 2023) గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును ఆదుకున్నాడు. తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతూనే అజేయంగా 201 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News