Saturday, November 15, 2025
HomeఆటWomen Cricketers Molested: ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులు.. రాజకీయ దుమారం

Women Cricketers Molested: ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులు.. రాజకీయ దుమారం

Australian Women Cricketers Molested In Indore: ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భద్రత, ఆతిథ్యంపై సందేహాలు రేకెత్తిస్తూ ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులపై గురువారం ఉదయం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

- Advertisement -

హోటల్ రాడిసన్ బ్లూ నుంచి సమీపంలోని ‘ది నైబర్‌హుడ్’ కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు అఖిల్ బైక్‌పై క్రీడాకారిణులను వెంబడించి, వారిలో ఒకరిని అసభ్యకరంగా తాకి పారిపోయినట్లు తెలుస్తోంది.

ALSO READ: IND vs AUS ODI 3rd: రో-కో విధ్వంసం.. మూడో వన్డేలో భారత్‌ సంచలన విజయం

ఆరు గంటల్లో నిందితుడి అరెస్ట్

ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో భయపడిన క్రీడాకారిణులు వెంటనే తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ డానీ సిమన్స్కు ఎమర్జెన్సీ మెసేజ్ పంపారు. “ఒక క్రీడాకారిణి ఏడుస్తూ నాకు కాల్ చేసింది. వెంటనే కారు పంపి వారిని సురక్షితంగా హోటల్‌కు తీసుకొచ్చాం,” అని సిమన్స్ తెలిపారు.

ఈ ఘటనను చూసిన ఓ వ్యక్తి నిందితుడి బైక్ నంబర్‌ను గుర్తించగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతనిని ట్రాక్ చేశారు. ఎమ్ఐజీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగానే, పోలీసులు యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం ఆరు గంటల్లోనే నిందితుడు అఖిల్‌ను ఆజాద్ నగర్‌లో అరెస్ట్ చేశారు. ఇతనిపై గతంలో కూడా నేర చరిత్ర ఉందని అడిషనల్ డీసీపీ (క్రైమ్ బ్రాంచ్) రాజేష్ దండోటియా ధ్రువీకరించారు.

ALSO READ: Virat Kohli: ఫీల్డింగ్‌లో కింగ్‌ స్టైలే వేరు.. సూపర్‌ క్యాచ్‌తో అదరగొట్టిన కోహ్లీ.. వీడియో

రాజకీయ విమర్శల దాడి

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ‘జీరో టాలరెన్స్’ పాలసీ ఉన్నా ఇలాంటివి జరగడం రాష్ట్ర పరువు తీసిందని కాంగ్రెస్ నాయకులు అభిషేక్ సింఘ్వి, జీతూ పట్వారీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, బీజేపీ పాలనలో విదేశీ అతిథులు కూడా సురక్షితంగా లేరని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

దీనిపై స్పందించిన బీజేపీ మంత్రి కైలాష్ విజయవర్గీయ, ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ ఈ ఘటన “జాతీయ గౌరవానికి సంబంధించిన విషయం” అని పేర్కొన్నారు. నిందితుడు అఖిల్‌పై ఎన్‌ఎస్‌ఏ (NSA) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేందుకు భయపడతారని శర్మ హెచ్చరించారు.

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) అధ్యక్షుడు మహానార్యమాన్ సింధియా విచారం వ్యక్తం చేస్తూ, ఒక వ్యక్తి చర్య ఇండోర్ ప్రతిష్టను దెబ్బతీసిందని అన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.

ALSO READ: Virat Kohli: ఎస్కలేటర్‌ మీద నుంచే ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్‌.. కోహ్లీ వీడియో వైరల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad