India vs South Africa 2025 Test Series: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సఫారీలతో పోరు నవంబర్ 14 నుంచి ప్రారంభంకానుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న శుభ్‌మాన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
ఇంగ్లాండ్ టూర్‌లో గాయం కారణంగా దూరమైన టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఈ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత జులై 23న ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో రిషభ్ పంత్ పాదానికి గాయమైంది. దీంతో అతడు స్వదేశంలో జరిగిన వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో ఆడలేకపోయాడు. అయితే అతడు ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నాడు. ఈ క్రమంలో పంత్ ను సౌతాఫ్రికా-ఏ వర్సెస్ ఇండియా-ఏ మధ్య జరుగుతున్న రెండు అనధికారిక టెస్టులకు ఎంపిక చేసింది. స్టార్ పేసర్ ఆకాష్ దీప్ ను కూడా జట్టులోకి తిరిగొచ్చాడు.
ఈ సిరీస్ నుంచి వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఎన్. జగదీశన్, ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను తప్పించింది. గత వెస్టిండీస్ సిరీస్ లో వీరిద్దరినీ ఎంపిక చేసినప్పటికీ వారికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. సౌతాఫ్రికా సిరీస్ లోనూ వారు స్థానం కోల్పోయారు. రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 14 నుంచి మెుదలుకానుంది. తొలి మ్యాచ్ నవంబర్ 14 నుండి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోతుంది. రెండో టెస్టుకు గౌహతిలోని ACA స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
Also Read: ICC T20I Rankings -దుమ్మురేపిన టీమ్ ఇండియా ఆటగాళ్లు.. అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్..
భారత జట్టు ఇదే: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.


