Saturday, November 15, 2025
HomeఆటBronco Test: టీమిండియా ఫాస్ట్ బౌలర్లకు కొత్త అగ్నిపరీక్ష..!

Bronco Test: టీమిండియా ఫాస్ట్ బౌలర్లకు కొత్త అగ్నిపరీక్ష..!

Bronco Test : టీమిండియా ఫాస్ట్ బౌలర్ల భవితవ్యం ఇప్పుడు కేవలం వికెట్లు తీయడం, బంతులు వేయడంపైనే ఆధారపడలేదు. అంతకు మించి ఒక కొత్త ఫిట్‌నెస్ సవాల్ వారి ముందు నిలిచింది. దాని పేరే ‘బ్రాంకో టెస్ట్’. ఈ కఠినమైన పరీక్షలో నెగ్గితేనే జట్టులో చోటు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ మినహా మిగతా ఫాస్ట్ బౌలర్లు అందరూ గాయాల బారిన పడటంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యో-యో టెస్ట్, 2 కిలోమీటర్ల టైమ్ ట్రయల్‌ మాత్రమే కాకుండా ఈ బ్రాంకో టెస్ట్ కూడా తప్పనిసరి.

- Advertisement -

Cabinet meeting: అమరావతికి నిధుల వరద

ఈ పరీక్ష ఎలా ఉంటుంది?
‘బ్రాంకో టెస్ట్’ నిజంగానే ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఇందులో ఒక ఆటగాడు వరుసగా 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా పరుగెత్తాలి. ఇది ఒక సెట్‌. ఇలాంటి ఐదు సెట్‌లను మధ్యలో ఎలాంటి విరామం లేకుండా పూర్తి చేయాలి. అంటే కేవలం 6 నిమిషాల్లో 1200 మీటర్ల దూరాన్ని పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ బౌలర్ల వేగం, వారి ఓర్పు, స్టామినాలను నిశితంగా పరీక్షిస్తుంది. టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆండ్రియన్ లే రౌక్స్ ఈ పరీక్షను ప్రతిపాదించగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనికి పూర్తి మద్దతు తెలిపారు.

రన్నింగ్‌కే ప్రాధాన్యం..
ఫాస్ట్ బౌలర్లు జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, దీంతో మైదానంలో పరుగెత్తే ఓపిక కోల్పోతున్నారని బీసీసీఐ గుర్తించింది. కేవలం కండలు పెంచుకుంటే సరిపోదని, బౌలింగ్ వేసేటప్పుడు కావాల్సిన సహజమైన ఫిట్‌నెస్‌, ఓర్పు అవసరమని బోర్డు భావిస్తోంది. దీంతో బ్రాంకో టెస్ట్ ద్వారా ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ కొత్త విధానం గాయాల సమస్యను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పింది బీసీసీఐ.

ఇప్పటికే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కొందరు క్రికెటర్లు ఈ పరీక్షను ఎదుర్కొన్నారు. ఈ కొత్త ఫిట్‌నెస్ విధానం భారత క్రికెట్ జట్టును మరింత పటిష్టం చేస్తుందని, భవిష్యత్తులో గాయాల బెడదను గణనీయంగా తగ్గిస్తుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కఠినమైన మార్పు భారత క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిన్నట్లు బీసీసీఐ పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad