Monday, April 21, 2025
HomeఆటBCCI: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ప్రకటన

BCCI: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ప్రకటన

2024-25 ఏడాదికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ బోర్డు(BCCI) ప్రకటించింది. మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో ఎంపిక చేసింది. గతేడాది కాంట్రాక్ట్‌ను కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది.

- Advertisement -

గ్రేడ్‌ A+: గ్రేడ్ A+ కేటగిరిలో నలుగురు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు చోటు కల్పించింది. వీరికి ఏడాదికి రూ.7 కోట్లను జీతంగా ఇవ్వనుంది.

గ్రేడ్ A: ఈ గ్రేడ్‌లో ఆరుగురు ప్లేయర్లకు చోటు లభించింది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమీ, సిరాజ్, రిషభ్‌ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున చెల్లించనుంది.

గ్రేడ్‌ B: ఈ కేటగిరీలో సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు ఛాన్స్‌ వచ్చింది. వీరికి సంవత్సరానికి రూ.3 కోట్ల వేతనం లభించనుంది.

గ్రేడ్‌ C: నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్, శివమ్‌ దూబె, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్‌ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్‌ ఖాన్, ఆకాశ్‌ దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణాకు అవకాశం లభించింది. వీరికి ఏడాదికి రూ. కోటి చొప్పున చెల్లించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News