IND vs BAN : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను వైట్‌వాష్ కాకుండా తప్పించుకోవాలంటే శనివారం జరిగే ఆఖరి వన్డేలో భారత్ తప్పకుండా గెలవాలి. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. బుధవారం జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. వేలిగాయం వేదిస్తున్నప్పటికి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ తృటిలో భారత్ ఓటమి పాలైంది.
గాయం కారణంగా మూడో వన్డేకు రోహిత్ అందుబాటులో ఉండడం లేడని బీసీసీఐ తెలిపింది. రోహిత్ ముంబైకి వచ్చినట్లు చెప్పింది. టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. “తొలి వన్డే తరువాత కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అతడికి రెండో వన్డేకి విశాంత్రి ఇచ్చాం. వైద్యుల సూచనలతో ఆఖరి మ్యాచ్ అతడు ఆడడం లేదు. కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ ఇద్దరు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెలుతారు” అని బీసీసీఐ తెలిపింది.
దీంతో మూడో వన్డేకు ముగ్గురు ఆటగాళ్లు దూరం కావడంతో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ముగ్గురు ఆటగాళ్లు దూరం అవడంతో తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది అనేది తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.
మూడో వన్డేకి భారత జట్టు :
కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), షాబాద్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్