Saturday, November 15, 2025
HomeఆటBCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. అకౌంట్లో రూ.20 వేల కోట్లు..!

BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. అకౌంట్లో రూ.20 వేల కోట్లు..!

BCCI: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐకు పేరుంది. అయితే, ఆ క్రికెట్ బోర్డు ఖాతాలో ఎన్ని నిధులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సింది. ఆ బోర్డు ఎంత రిచ్చో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. బీసీసీఐ ఖాతాలో రూ. 20 వేల కోట్లకుపైగా నిధులు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత ఐదేళ్లలో బోర్డు సంపద దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు సమాచారం. అత్యంత విజయవంతమైన ఐపీఎల్‌తో బోర్డుకు భారీగా ఆదాయం వస్తోంది. అలాగే ఐసీసీ నుంచి అందే వాటాతోపాటు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచుల మీడియా హక్కుల నుంచి ఆదాయం అందుతోంది.  బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,623 కోట్ల మిగులు నమోదు చేసింది. ఇది అంతకుముందు ఏడాది రూ.1,167 కోట్లుగా ఉండేది.
Read Also: Bengal: నోట్లో యాసిడ్ పోస్తా.. ఎమ్మెల్యేకు టీఎంసీ నేత బెదిరింపులు

- Advertisement -

బీసీసీఐ ఏజీఎం
సెప్టెంబర్ 28న బీసీసీఐ ఏజీఎం జరగనుంది. ఈ క్రమంలో 2024 అకౌంట్స్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్‌ వివరాలు బయటకొచ్చాయి. క్రీడా వర్గాల సమాచారం మేరకు.. బీసీసీఐ వద్ద 2019 నాటికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఉండేవి. అయితే, గత ఐదేళ్లలో అదనంగా రూ.14,627 కోట్ల సంపదను సృష్టించింది. దీంతో మొత్తం రూ.20,686 కోట్లకు చేరింది. మరే ఇతర క్రికెట్‌ బోర్డు వద్ద కూడా ఇంత మొత్తం ఉండే అవకాశం లేదు. ‘‘బీసీసీఐ సభ్యులకు కార్యదర్శి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019లో రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన వాటితో కలిపి బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్   రూ.6,059 కోట్లు ఉండేది. ఇప్పుడు ఆయా సంఘాలకు చెల్లించినది పోగా మిగులు రూ.20,686 కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో రూ.14,627 కోట్ల సంపద అదనంగా వచ్చి చేరింది. ఒక్క గతేడాదే రూ.4,193 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ. 1,200 కోట్లను మైదానాల్లో మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది. ప్లాటినమ్‌ జూబ్లీ ఫండ్‌గా రూ. 350 కోట్లు, క్రికెట్‌ అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. రాష్ట్ర క్రికెట్ సంఘాలు రూ.1,990 కోట్లు అందుకొన్నాయి’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ వివరాలకు అధికారికంగా 28న జరిగే ఏజీఎంలో ఆమోదం తెలపడమే తరువాయి.

Read Also: Bigg Boss: ఉహకందని మార్పులు.. ఊహించని ట్విస్టులు.. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్

ఆదాయ మార్గాలు..

ఇకపోతే, బీసీసీఐకి చాలా ఆదాయ వనరులు ఉన్నాయి. వాటి ద్వారా అది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది. ఓ నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రికార్డు స్థాయిలో రూ.9,741 కోట్లు సంపాదించింది. ఈ భారీ ఆదాయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రధాన పాత్ర పోషించింది. మొత్తం ఆదాయంలో 50% కంటే ఎక్కువ, అంటే రూ.5,741 కోట్లు, కేవలం ఐపీఎల్ ద్వారానే వచ్చింది. ఐపీఎల్ కాని మీడియా హక్కుల ద్వారా కూడా బీసీసీఐ సుమారు రూ.361 కోట్లు ఆర్జించింది. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్. దీని ద్వారా బీసీసీఐకి భారీ ఆదాయం వస్తుంది. 2023-24 సంవత్సరానికి బీసీసీఐ సంపాదనలో 50% పైగా ఐపీఎల్ నుంచే వచ్చిందని నివేదిక పేర్కొంది. ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టుకు తమ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి రూ.120 కోట్ల బడ్జెట్ ఉంటుంది.

బీసీసీఐకి ఇతర ఆదాయ మార్గాలు ఇవే..

ఐపీఎల్ – రూ.5741 కోట్లు

ఐసీసీ వాటా – రూ.1042 కోట్లు

రిజర్వులు, పెట్టుబడులు – రూ.987 కోట్లు

ఐపీఎల్-యేతర మీడియా హక్కులు – రూ.361 కోట్లు

టికెట్ అమ్మకాలు, వాణిజ్య హక్కులు – రూ.361 కోట్లు

బీసీసీఐ తమ ఆటగాళ్లకు, కోచ్‌లకు మంచి జీతాలు ఇవ్వడంలో కూడా ముందుంటుంది. బీసీసీఐలోని గ్రేడ్ A+ కేటగిరీలో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి వార్షిక జీతం రూ.7 కోట్లు అందుతుంది. గ్రేడ్ A, B, C లలో ఉన్న ఆటగాళ్లు వరుసగా రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, రూ. కోటి జీతంగా పొందుతారు. దీనితో పాటు, ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు, వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా అదనపు ఆదాయం కూడా సంపాదిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad