Saturday, November 15, 2025
HomeఆటBCCI: రాష్ట్ర క్రికెట్ సంఘాలపై బీసీసీఐ ఫైర్.. ఎందుకంటే?

BCCI: రాష్ట్ర క్రికెట్ సంఘాలపై బీసీసీఐ ఫైర్.. ఎందుకంటే?

BCCI: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన దులీప్ ట్రోఫీకి ప్లేయర్ల ఎంపికపై బీసీసీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. టీమిండియా స్టార్ ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేయకపోవడంతో మండిపడింది. మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్ వంటి సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న కీలక ఆటగాళ్లను రాబోయే రంజీ ట్రోఫీకి సౌత్ జోన్ జట్టులోకి తీసుకోకపోవడాన్ని బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ ఘాటుగా ఒక ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. సిరాజ్, రాహుల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లకు కూడా సౌత్ జోన్ జట్టులో చోటు దక్కలేదు. ఈ పరిణామంపైన బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ అబే కురువిల్లా స్పందించారు. దులీప్ ట్రోఫీకి గౌరవాన్ని ఇవ్వాలని రాష్ట్ర సంఘాలకు సూచించారు. “దులీప్ ట్రోఫీ ప్రతిష్ఠ‌ను కాపాడుంకు, అత్యున్నత స్థాయి పోటీ ఉండేలా చూడటానికి, అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లందరినీ తప్పనిసరిగా వారి వారి జోనల్ జట్లలోకి ఎంపిక చేయాలి. ఈ విషయాన్ని జోనల్ కన్వీనర్లు అర్థం చేసుకోవాలి” అని ఆయన తన ఈమెయిల్‌లో స్పష్టం చేశారు.

- Advertisement -

Read Also: Earthquake: సౌత్ అమెరికాలో భారీ భూకంపం..!

విభిన్నంగా రాష్ట్రాల వాదనలు..

అయితే, ఈ విషయంలో కొన్ని రాష్ట్ర సంఘాలు భిన్నమైన అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్లు జట్టులోకి వస్తే, దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. వారి అవకాశాలు దెబ్బతింటాయని కొన్ని సంఘాలు భావిస్తున్నాయి. వారి స్థానంలో ఇండియా-ఏ లేదా బోర్డ్ ప్రెసిడెంట్స్ XI వంటి జట్లకు జాతీయ ఆటగాళ్లను ఎంపిక చేయడం మేలని అంటున్నారు. అసలైతే, సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు జాతీయ విధుల్లో లేనప్పుడు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని 2024లోనే బీసీసీఐ స్పష్టమైన నిబంధన తీసుకొచ్చింది. అంతేకాకుండా, జాతీయ జట్టు కోచ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశవాళీ టోర్నీలను వీడ‌టానికి వీల్లేదని క్లారిటీ ఇచ్చింది.  ఈ నిబంధన ప్రకారమే శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే తమ జట్లతో చేరారు. ఇప్పుడు కొందరు ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ మరోసారి కఠినంగా వ్యవహరించింది.

Read Also: Parliament: పార్లమెంటు భవనంలో మరోసారి బయటపడ్డ భద్రతావైఫల్యం..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad