New Jersey Sponsor Deal: రీసెంట్ గా భారత పార్లమెంటులో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో డ్రీమ్ 11 టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా వైదొలిగింది. దీంతో బీసీసీఐ కొత్త భాగస్వామి కోసం వెతుకులాట మెుదలుపెట్టింది. బీసీసీఐ 2025-2028 మధ్య కాలానికి కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 450 కోట్లు ఉండవచ్చని అంచనా. అయితే ఆసియా కప్ కు ముందే కొత్త స్పాన్సర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ కోరుకుంటోంది. కానీ టైం చాలా తక్కువగా ఉంది. అయితే వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025కు ముందే కొత్త స్పాన్సర్‌షిప్ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
డ్రీమ్11 స్థానంలో కొత్త స్పాన్సర్
2023లో డ్రీమ్11 బీసీసీఐతో దాదాపు రూ. 358 కోట్ల కాంట్రాక్టు కుదుర్చుకుంది. కానీ కేంద్రం తెచ్చినఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా ఆ ఒప్పందం ఒక సంవత్సరం ముందే ముగిసిపోయింది. ఆసియా కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ పై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మూడు సంవత్సరాల కాలానికి కొత్త స్పాన్సర్‌ను వెతుకుతోంది. ఈ సమయంలో భారత జట్టు సుమారు 140 మ్యాచ్‌లు ఆడబోతుంది. గతంలో డ్రీమ్ 11తో చేసుకున్న డీల్ తో పోలిస్తే ఇది డబ్బు పరంగా చాలా పెద్దది. ఈ స్పాన్సర్‌షిప్ ఒప్పందం దేశ, విదేశాల్లో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే కాకుండా, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC), ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే టోర్నమెంట్‌లకు కూడా వర్తిస్తుంది.
ప్రతి మ్యాచ్‌కు భారీ ధర
బోర్డు ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు, ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్‌లలో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ. 1.5 కోట్లను ధరను నిర్ణయించనుంది. ఇది డ్రీమ్11తో పోలిస్తే ఎక్కువ, కానీ గతంలో ఉన్న బైజూస్ డీల్ కంటే తక్కువనే చెప్పాలి.
Also read: Asia Cup 2025 -ఆసియా కప్ కు స్క్వాడ్స్ ను ప్రకటించిన జట్లు ఇవే..!
సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్
ఆసియా కప్ సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ సెప్టెంబరు 28 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. భారత్ తన తొలి టీ20 మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో, 14న పాకిస్తాన్‌తో ఆడనుంది.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హర్షిత్ రానా, రింకూ సింగ్.
Also read: Cricket :- క్రికెట్ చరిత్రలోనే ఇదొక హఠాత్ పరిణామం


