BCCI| టీమిండియా టెస్టుల్లో ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్‌లో ఏకంగా క్లీన్ స్వీప్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో ఆడటం లేదని.. వారిని పక్కన పెట్టాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. అలాగే ఇటీవల హెడ్ కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ తీరుపైనా విమర్శలు మొదలయ్యాయి. దీంతో మూడు ఫార్మాట్లకు ముగ్గరు కోచ్‌లను నియమించాలని మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు బీసీసీఐకి సూచిస్తున్నారు. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయనే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే టీమిండియా హెచ్ కోచ్ విషయంలో బీసీసీఐ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్‌లను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు ఆటతీరును బట్టి ఓ అంచనాకు రానున్నారట. ఈ సిరీస్‌లో ఐదు టెస్టులు జరగనున్నాయి. ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు టెస్టులు గెలిస్తే కానీ రోహిత్ సేన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరలేదు. దీంతో ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఈ సిరీస్‌లో కానీ ఓడితే మాత్రం టెస్టులు, వన్డేటు, టీ20లకు వేర్వేరు హెడ్ కోచ్‌లు నియమించాలని డిసైడ్ అయ్యారట. కాగా గతంలో ఎన్నడూ బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.