BCCI Hunts for New Selectors: జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఐదుగురు సభ్యుల సీనియర్ పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీలో రెండు ఖాళీలను, అలాగే మహిళల ప్యానెల్‌లో నాలుగు స్థానాలను భర్తీ చేయడానికి బీసీసీఐ శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హత ప్రమాణాలలో ఎటువంటి మార్పులు చేయలేదు. గతేడాదిగా ఇవే ప్రమాణాలు ఉన్నాయి. దరఖాస్తుదారులు కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి లేదా 10 వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) లేదా 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు అప్లై చేసుకోవచ్చు.
సెలక్టర్ల కాంట్రాక్టులను ఏటా పునరుద్ధరిస్తామని..కొత్త సెలక్టర్ల భర్తీ ప్రక్రియ తర్వరలో చేపట్టబడుతోందని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపారు. వచ్చే నెల జరిగే ఆసియా కప్ కోసం భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని పురుషుల సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ ప్యానెల్ లో ఎస్ఎస్ దాస్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా మరియు ఎస్. శరత్ ఉన్నారు.
Also Read: Asia Cup 2025- ఆసియా కప్ లో ఆడబోతున్న 8 టీమ్స్ టీ20 ర్యాంకులు ఏంటో తెలుసా?
మహిళల జాతీయ సెలక్షన్ కమిటీలో నాలుగు స్థానాలకు కూడా బీసీసీఐ దరఖాస్తులను తెరిచింది. ప్రస్తుత ప్యానెల్‌లో నీతు డేవిడ్ (ఛైర్‌పర్సన్), రేణు మార్గరేట్, ఆరతి వైద్య, కల్పనా వెంకటాచర్ మరియు శ్యామా డే షా ఉన్నారు. అండర్-22 స్థాయి వరకు జట్లను ఎంపిక చేసే జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో కూడా ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు దరఖాస్తులను సెప్టెంబరు 10లోగా సమర్పించాలని బోర్డు సూచించింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగబోయే టీ20ప్రపంచ కప్ నేపథ్యంలో సెలెక్టర్ల ఎంపిక కీలకం కానుంది.
Also Read: Asia Cup – ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఎవరిది పై చేయంటే?


