Friday, January 16, 2026
HomeఆటIND vs NZ ODI: రో-కో రీలోడెడ్... ఇక న్యూజిలాండ్‌కు చుక్కలే..

IND vs NZ ODI: రో-కో రీలోడెడ్… ఇక న్యూజిలాండ్‌కు చుక్కలే..

India vs New Zealand 1st ODI: భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జనవరి 11 నుంచి వడోదర వేదికగా ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి చేరడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

నెట్స్‌లో చెమటోడ్చుతున్న రోకో
తొలి వన్డేకు ముందు భారత ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. “RoKo reloaded” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో రోహిత్, విరాట్ తమ ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించారు.

Also Read: Malaysia Open -సెమీఫైనల్లో సింధు ఓటమి.. ముగిసిన భారత ప్రస్థానం..

విరాట్ కోహ్లీ తన స్టైలిష్ ఆఫ్ డ్రైవ్స్‌తో పాటు రకరకాల షాట్లను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. హిట్ మ్యాన్ తనదైన శైలిలో లెగ్-గ్లాన్స్ షాట్లు ఆడుతూ బ్యాట్‌కు పనిచెప్పాడు.బ్యాటింగ్‌తో పాటు క్యాచ్‌లు పట్టడం, ఫీల్డింగ్ డ్రిల్స్ మరియు రన్నింగ్‌లోనూ ఈ ఇద్దరు దిగ్గజాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వయసు పెరుగుతున్నా ఈ ఇద్దరికి పరుగుల దాహం తీరడం లేదు.

Also Read: ind vs nz -రేపటి నుంచే కివీస్‌తో వన్డే సమరం.. రికార్డుల్లో టీమిండియాదే పైచేయి!

భీకర ఫామ్‌లో స్టార్ ద్వయం
విరాట్ కోహ్లీ గత డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 302 పరుగులు (151 సగటు) సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఆపై 15 ఏళ్ల తర్వాత ఆడిన విజయ్ హజారే ట్రోఫీలోనూ ఢిల్లీ తరపున 131 మరియు 77 పరుగులతో చెలరేగి తన వింటేజ్ ఫామ్‌ను గుర్తుచేశాడు. రోహిత్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున సెంచరీ బాది టచ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం కావడంతో, 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. రేపు వడోదరలో జరగబోయే తొలి వన్డేలో ఈ జోడీ ఏ మేర విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News