Betting Apps case ED Seize Raina And Dhawan Assets: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. వారిద్దరికీ చెందిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కాగా, ఇటీవల ఈ కేసులో వీరిద్దరూ ఈడీ విచారణకు సైతం హాజరయ్యారు.
Also Read: https://teluguprabha.net/sports-news/yuvraj-singh-reaction-to-abhishek-sharma-and-gill-beach-photos/
ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్.. మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, వాటికి సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో యాక్టింగ్ చేసినందుకు వారిద్దరిపై 1xBet బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు గతంలో నమోదైన విషయం తెలిసిందే. ఇదే అంశంపై గతంలో రైనా, ధావన్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
విచారణలో భాగంగా 1xBet మనీలాండరింగ్ కేసులో సురేష్ రైనా, శిఖర్ ధావన్ ప్రమేయం ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. బెట్టింగ్ యాప్ వాణిజ్య ప్రకటనల్లో నటించినందుకు, ఆ తర్వాత వాటిని ప్రమోట్ చేసినందుకు ఆయా సంస్థల నుంచి మనీలాండరింగ్ రూపంలో రెమ్యునరేషన్ పొందారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఎక్కడా అధికారికంగా పొందుపరచకపోవడంతో లోపాలు అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో తాజాగా చర్యలకు దిగారు.
Also Read: https://teluguprabha.net/sports-news/bcci-announced-indian-squad-for-south-africa-test-series/
కాగా, తొలి విడతలో భాగంగా సురేష్ రైనా, శిఖర్ ధావన్‌కు సంబంధించి మొత్తం ఈడీ రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అయితే మున్ముందు ఈ మొత్తం మరింత పెరగవచ్చని సమాచారం. అదే సమయంలో- వీరిద్దరిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫెమా చట్టం ఉల్లంఘన కింద కేసులు నమోదయ్యే సూచనలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


