Bhimavaram Bulls Captain: టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆగస్టు 8వ తేదీ నుంచి జరగబోయే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో ఆ టీమ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని భీమవరం బుల్స్ ఫ్రాంచైజీకి చెందిన అధికారి ఒకరు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇటీవలే జరిగిన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వేలంలో అతడ్ని రూ.10 లక్షలకు భీమవరం జట్టు కొనుగోలు చేసింది.
నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. అయితే ఈ సిరీస్ ఆగస్టు 4 నాటికి ముగుస్తుంది. ఆ వెంటనే నితీశ్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటాడు. ఏపీఎల్‌కు చెందిన నాలుగో సీజన్ ఆగస్టు 8 నుంచి ప్రారంభమయ్యి.. ఆగస్టు 24తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో ఏడు జట్లు పోటీ పడనున్నాయి.
ఆ టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. వాటిలో భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, విజయవాడ సన్‌షైనర్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ లీగ్ కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు వైజాగ్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి.
భీమవరం బుల్స్ టీమ్ ఇదే..
నితీశ్ కుమార్ రెడ్డి(కెప్టెన్), హేమంత్ రెడ్డి, సత్యనారాయణ రాజు, హరి శంకర్ రెడ్డి, సాయి శ్రవణ్, కే రేవంత్ రెడ్డి, పిన్నిటి తేజస్వి, టీ వంశీ కృష్ణ, బీ సాత్విక్, సాయి సూర్య తేజ రెడ్డి, ఎం యువన్, మునీశ్ వర్మ, సీ రవితేజ, శశాంక్ శ్రీవత్స్, కశ్యప్ ప్రకాశ్, ఎన్ హిమాకర్, సీహెచ్ శివ, భువనేశ్వర్ రావు, భస్వంత్ కృష్ణ, జే విష్ణు దత్తా.


