Saturday, November 15, 2025
HomeఆటNeymar: ఫుట్ బాల్ స్టార్ కు రూ. వేల కోట్లు రాసిచ్చేసిన బిలియనీర్..!

Neymar: ఫుట్ బాల్ స్టార్ కు రూ. వేల కోట్లు రాసిచ్చేసిన బిలియనీర్..!

Neymar: క్రీడాకారులకు ఫ్యాన్స్ ఉండటం సహజమే. వారిని అభిమానించడం, ఆరాధించడం అంతా కామన్. వారి కోసం ఏదైనా చేయడం, ఎంతదూరమైనా వెళ్లే ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ, ఓ అజ్ఞాత బిలియనీర్‌ మాత్రం బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ నెయ్‌మర్‌ (Football star Neymar) మీద ఉన్న ప్రేమతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నెయ్‌మర్‌ని జీవితంలో ఒక్కసారి కూడా కలవకుండానే తన ఆస్తినంతా రాసి ఇచ్చేశారట. కాగా.. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్రెజిల్‌ (Brazil)లోని పోర్టో అలెగ్రికి చెందిన ఓ 31 ఏళ్ల వ్యాపారవేత్త రాసిన వీలునామా ఒకటి తాజాగా బయటికొచ్చింది. 6.1 బిలియన్‌ బ్రెజిల్ రియల్స్‌ (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.10వేల కోట్లు) విలువైన తన సంపద అంతా ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ నెయ్‌మర్‌కు దక్కాలని ఆ బిజినెస్‌మ్యాన్‌ తన వీలునామాలో రాసినట్లు బ్రెజిల్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ వ్యాపారవేత్త ఇటీవల మరణించగా.. అతడికి భార్యాపిల్లలు లేరని పేర్కొన్నాయి. ఈ ఏడాది జూన్‌ 12న వీలునామాను అధికారికంగా రిజిస్టర్‌ చేసినట్లు సమాచారం.
Read Also: Periods: పీరియడ్స్ ముందుగా వచ్చినా, ఆలస్యమైనా కష్టమే..!

- Advertisement -

నెయ్ మర్ ఏమన్నారంటే?
అయితే, ఆ వ్యాపారవేత్తకు నెయ్‌మర్‌తో ఎలాంటి వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధం లేదు. అయినప్పటికీ తన యావదాస్తిని రాసివ్వడం చర్చనీయాంశమైంది. అయితే, నెయ్‌మర్‌ పట్ల ఉన్న ఆరాధనా భావంతోనే ఆ బిజినెస్‌మ్యాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట. ‘‘నాకు నెయ్‌మర్‌ అంటే చాలా ఇష్టం. అతడిని చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది. తండ్రితో నెయ్‌మర్‌ అనుబంధం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అతడు కేవలం అథ్లెట్‌ మాత్రమే కాదు.. కుటుంబ విలువలు తెలిసిన గొప్ప వ్యక్తి’’ అని ఆ వీలునామాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై నెయ్‌మర్‌ టీమ్‌ స్పందించింది. దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొంది. మరోవైపు, ఈ వీలునామా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెయ్‌మర్‌కి సుమారు 6.2 బిలియన్ బ్రెజిలియన్ రియల్‌ (రూ.846 కోట్లు) ఆస్తులు ఉన్నాయని ఫోర్బ్స్ తెలిపింది. 2024లో సౌదీ క్లబ్‌ అల్ హిలాల్ తరపున ఆడుతూ ఆయన సుమారు రూ. 90.7 కోట్లు సంపాదించాడు. దీంతో అతను క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల తర్వాత మూడో అత్యధిక వేతనం పొందిన ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం నెయ్‌మర్ తన చిన్ననాటి క్లబ్ సాంటోస్‌కి తిరిగి చేరాడు. 2026 వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ తరపున ఆడాలని చూస్తున్నాడు. అయితే, ఇప్పడు చట్టపరంగా బిలియనీర్‌ ఆస్తి దక్కితే గనుక.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న అథ్లెట్లలో ఒకడిగా నిలుస్తాడు.

Read Also: Trump: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోయా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

పన్ను ఎగవేత కేసులో..

మరోవైపు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాల్లో పన్ను ఎగవేతకు పాల్పడిన కేసులో బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నెయ్ మర్ కు ఇటీవలే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రూ.110 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు తేలడంతో… అతడి ఆస్తులను జప్తు చేయాలని సావోపాలో ఫెడరల్ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అతడి యాట్, జెట్ లతో పాటు మొత్తం రూ.50 మిలియన్ డాలర్ల (రూ.342 కోట్లు) ఆస్తులను జప్తు చేయాలని తెలిపింది. ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఫెడరల్ టాక్స్ అధికారులు ఆస్తుల జప్తుకు చర్యలు చేపట్టారు. ఇదిలాఉంటే బకాయిపడిన మొత్తాన్ని గనుక తిరిగి చెల్లిస్తే నెయ్ మర్ జైలుకు వెళ్లే అవకాశం ఉండదని బ్రెజిల్ ఫెడరల్ టాక్స్ ఏజెన్సీ ఆడిటర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad