Monday, March 3, 2025
HomeఆటRohit Sharma: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతపై బీజేపీ ఆగ్రహం..!

Rohit Sharma: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతపై బీజేపీ ఆగ్రహం..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు షామా మహమ్మద్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోహిత్ స్వార్థం లేని ఆటగాడు, దేశానికి ఎన్నో గొప్ప విజయాలు సాధించాడంటూ మండిపడుతున్నారు. తాజాగా షామా మహమ్మద్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మాండవీయ స్పందించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని సూచించారు.

- Advertisement -

రాజకీయాల్లో కొనసాగుతూ బాడీ షేమింగ్ చేయడం ఏంటని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికల మీద దేశాన్ని ఎన్నో సార్లు రోహిత్ శర్మ గర్వపడేలా చేశారని.. అలాంటి వ్యక్తిపై మాట్లాడటం సిగ్గుచేటని సీరియస్ అయ్యారు. షామా మహమ్మద్‌తో పాటు ఆమె వ్యాఖ్యలను సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ పైనా కేంద్రమంత్రి మాండవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో 93 ఎన్నికలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడటంపై బీజేపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు గెలవటం నేర్చుకోవాలని హితవు పలికింది. బీజేపీతో పాటు బీసీసీఐ(BCCI) కూడా షమా మహమ్మద్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నా వ్యాఖ్యల్లో తప్పేముంది: అయితే షామా మహమ్మద్ తొలుత తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఎలాంటి కారణం లేకుండా తనపై దాడి చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే హక్కు ఉందని చెప్పారు. క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలని తాను కోరుకుంటున్నానని.. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని.. అందుకే ఈ వ్యాఖ్యలు చేశానని తెలిపింది. అయితే తనను ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఏమందంటే: మరోవైపు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటంతో.. షామా పోస్ట్ పై కాంగ్రెస్ స్పందించింది. దీనితో పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. ఆ పోస్టులు వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయకూడదని.. జాగ్రత్తగా ఉండాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్రీడా దిగ్గజాలకు అత్యున్నత గౌరవం ఇస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News