Saturday, November 15, 2025
HomeఆటBrian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై తీవ్రంగా మండిపడ్డ బ్రియాన్ లారా

Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై తీవ్రంగా మండిపడ్డ బ్రియాన్ లారా

ఈ విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుదే ఎక్కువ తప్పు ఉందని.. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను దేశం కోసం ఆడేలా చేయడంలో విండీస్ బోర్డు విఫలం అయ్యిందని బ్రియాన్ లారా ఆరోపించారు. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులను చూసి విండీస్ క్రికెట్ బోర్డు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు.

నికోలస్ పూరన్ లాంటి ప్రతిభగల ఆటగాళ్లు తమకు నచ్చిన దారిని ఎంచుకుంటారని బ్రియాన్ లారా అన్నారు. 29 ఏళ్ల వయసులోనే నికోలస్ పూరన్ రిటైర్మెంట్ తీసుకున్నాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే అతని రిటైర్మెంట్ కు కారణం కూడా అందరికి తెలిసిన విషయమేనని లాారా స్పష్టం చేశారు.

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐదు నుంచి ఆరు క్రికెట్ లీగ్ లు జరుగుతున్నాయని.. ఇందులో తమ ఆటగాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నాయని లారా చెప్పారు. అయితే స్టార్ ఆటగాళ్లు జాతీయ జట్టులో కొనసాగేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తగిన చర్యలు తీసుకోవడం లేదని లారా విమర్శించారు. క్రికెటర్లు తమ కుటుంబాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇప్పటికైనా బోర్డు తగిన డబ్బు చెల్లించాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad